కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో రెండు కేసులు నమోదు

కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో రెండు కేసులు నమోదు

CTR: కార్వేటినగరం(M)లో ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్‌పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఆదామ్, యుగంధర్ మధ్య తలెత్తిన గొడవ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.