రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

TPT: తడ రైల్వే స్టేషన్లో ఆదివారం రైలు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు..ఒకటో ప్లాట్‌ఫామ్ నుంచి రెండో ప్లాట్‌ఫామ్ వైపు పట్టాలు దాటుతుండగా కోరమండల్ ఎక్స్‌ప్రేస్ (12841) రైలు ఢీకొనడంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు.