సీఎంలకు కేంద్రమంత్రి కీలక రిక్వెస్ట్
దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక విజ్ఞప్తి చేశారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF)పై విధిస్తున్న VATను తగ్గించాలని కోరారు. వ్యాట్ తగ్గించటం వల్ల ప్రయాణికులుకు కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా బ్యారెల్ ATF ధర 99.40 డాలర్ల నుంచి ఏకంగా 195.19 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో వ్యాట్ తగ్గించాలని సీఎంకు కేంద్రమంత్రి లేఖ రాశారు.