దంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డా. సునీత
WGL: నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ దంతాల దినోత్సవం నిర్వహించారు. అనంతరం దంత వైద్య అధికారి డా. సునీత మాట్లాడుతూ.. దంతాల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. రోజుకు కనీసం రెండు సార్లు పళ్లు తోముకోవడం, తీపి పదార్థాలను అధికంగా తీసుకోరాదని ప్రజలకు సూచించారు. దంత సమస్య కలిగినచో సంబంధిత డాక్టర్ల సలహా తీసుకోవాలని కోరారు.