మంగళగిరిలో వర్షం.. విద్యుత్‌కు అంతరాయం

GNTR: ఉదయం నుంచి మంగళగిరిని మంచు కప్పినట్లుగా ఉండి, ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఈ వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చివరి నిమిషంలో పూజా సామగ్రి కొనుగోలు చేయడానికి కొద్ది సంఖ్యలో మాత్రమే ప్రజలు దుకాణాల వద్ద కనిపించారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.