త్రాగునీటి సమస్యలపై అధికారుల పరిశీలన

త్రాగునీటి సమస్యలపై అధికారుల పరిశీలన

KRNL: ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో త్రాగునీటి సమస్యలపై ఇవాళ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంపీడీవో నాగరాజు స్వామి ఆధ్వర్యంలో గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. జంగాల కాలనీలో మోటారు మొరాయించడంతో నీటి సరఫరా నిలిచిపోవడాన్ని గుర్తించారు. తక్షణమే మరమ్మతులు చేసి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.