మహిళా ఉపాధ్యాయులకు రైల్వే జేఏసీ సన్మానం
HNK: దేశ తొలి మహిళా గురువు సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి వేడుకలను రైల్వే జేఏసీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పదిమంది మహిళా ఉపాధ్యాయులను ఈ సందర్భంగా శనివారం ఘనంగా సన్మానించారు. రైల్వే జేఏసీ నాయకులు దేవులపల్లి రాఘవేందర్రావు, కొండ్ర నర్సింగరావు పాల్గొన్నారు.