రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

MHBD: తొర్రూరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అధిక వేగంతో ఓవర్‌టేక్ చేయడంతో రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొనడంతో కృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఎండీ సజీర్, మహేశ్, పైలట్లు సంపత్, చెడుపాక రఘు సంఘటనా స్థలానికి చేరుకుని వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు.