పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

కృష్ణా: 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని గవర్నర్‌పేట సీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.