VIDEO: చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత
కోనసీమ: తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆలయం మూసి వేయబడుతుందని డిప్యూటీ కమీషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు ఆదివారం పేర్కొన్నారు. తిరిగి మరల బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటలు నుంచి యధావిధిగా దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.