సూర్యాపేటలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం
SRPT: జిల్లాలో ఆడపిల్లలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇచ్చే HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా 14 ఏళ్లు నిండిన కిశోర బాలికలకు షెడ్యూల్ ప్రకారం ఈ టీకాలు వేయనున్నట్లు తెలిపారు.