దేశాయిపేటలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం
KMR: జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో శనివారం మండల బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో నాయకులు ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలకు కారు గుర్తుకు ఓటు వేసి గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా నమూనా ఏవీఎంపై కారు గుర్తు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.