విద్యార్థులకు గుడ్ న్యూస్..!

విద్యార్థులకు గుడ్ న్యూస్..!

KMM: 2026-27 విద్యా సంవత్సరానికి TGSWRS సెట్‌-2026 ప్రవేశాలకు ఈరోజు నుంచి APR 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కల్లూరు గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్‌ కనకదుర్గ తెలిపారు. 2026లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.