అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్టరీలను నిర్మించాం: ఇరాన్

తమ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్టరీలను నిర్మించినట్లు ఇరాన్ వెల్లడించింది. క్షిపణలు అభివృద్ధిపైనే ప్రధానంగా తమ సైన్యం దృష్టి సారించినట్లు తెలిపింది. తమ ఫ్యాక్టరీలను త్వరలోనే అధికారికంగా తెరుస్తామని పేర్కొంది. ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో అత్యాధునిక క్షిపణులను ప్రయోగించలేదని.. వాటిని ఇజ్రాయెల్ దళాలు అడ్డుకోలేకపోయేవని చెప్పింది.