ZPHS పాఠశాలను తనిఖీ చేసిన MEO

KDP: కాశినాయన మండలం గొంటువారిపల్లిలో ZPHS పాఠశాలను మంగళవారం MEO నిర్మల ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం మధ్యాహ్న భోజనం రుచి చూసి, నాణ్యతను పరిశీలించి, ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో T. ప్రదీప్, సురేశ్ బాబు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.