విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

PPM: కొమరాడ మండలంలో జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి డా. జగన్ మోహన్ పాఠశాలలు, హాస్టల్స్, పీహెచ్‌సీలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వేసవి సెలవుల ముందు విద్యార్థులు ఆరోగ్యంగా ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీరు, మజ్జిగ తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం పై అవగాహన కల్పించారు.