‘వార్డులలో పారిశుద్ధ్యం మెరుగుపరచండి’
VSP: వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. శనివారం గాజువాక పరిధిలోని పర్యటించి పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు ఉన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు.