ఘనంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం
నెల్లూరు: ఇందుకూరుపేట మండలంలోని మైపాడు శివాలయంలో గురువారం గణపతి అయ్యప్ప కుమారస్వామి ఉత్సవమూర్తుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంగళ వాయిద్యాలు నడుమ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.