VIDEO: సుద్ద ముక్కపై మా తెలుగు తల్లికి గేయ రచయిత ప్రతిమ

VIDEO: సుద్ద ముక్కపై మా తెలుగు తల్లికి గేయ రచయిత ప్రతిమ

SRPT: కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్‌చారి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్భంగా ఆదివారం అంగుళం సుద్ద ముక్కపై ఆయన ప్రతిమను చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో నరేష్ చారి బియ్యం, పప్పు గింజలు, పెన్సిల్ మొన, ఆకులపై సినీ, రాజకీయ ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధుల ప్రతిమలను చెక్కి ప్రశంసలు పొందాడు.