చేపలు పట్టిన మంత్రి జూపల్లి

NGKL: కేసరి సముద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేపలు పట్టి సందడి చేశారు. జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తిరుగు ప్రయాణంలో కేసరి సముద్రం వద్ద యువకులు చేపలు పడుతుండటం చూసి కారు ఆపారు. వాళ్ల వద్దకు వెళ్లి స్వయంగా గాలం వేసి చేపలు పడుతూ వాళ్లతో మమేకమయ్యారు. చేపలు పట్టే విధానం, చేపల లభ్యత వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.