జగన్‌కు భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలి: మంత్రి

జగన్‌కు భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలి: మంత్రి

కోనసీమ: ఏపీ రాజధాని అమరావతి పేరు అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అమరావతి విషయంలో జగన్‌కు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నాను అన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.