అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్ సర్వీసు
NRPT: పౌర్ణమి సందర్భంగా నారాయణపేట ఆర్టీసీ డిపో నుంచి అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక లగ్జరీ బస్ సర్వీసు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ఈ నెల 3న సాయంత్రం 6 గంటలకు బస్సు బయలుదేరి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం 5న తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. పెద్దలకు రూ.4వేలు ఛార్జీ ఉంటుందని ఆమె చెప్పారు.