'ఈ-లాటరీ ద్వారా 1,756 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు'

GNTR: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ జరీబు రైతులకు మంగళవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో 1,756 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. ఇందులో 1,033 నివాస, 723 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. మొత్తం 746 మంది రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా ఈ ప్లాట్లు కేటాయించారని ప్రకటనలో తెలిపారు.