కాలువలు శుభ్రం చేసిన పోలీసులు

కాలువలు శుభ్రం చేసిన పోలీసులు

VZM: చీపురుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం స్వచ్చ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. చీపురుపల్లి ఎస్సై దామోదర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కాలువలను శుభ్రం చేశారు. మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని ఎస్సై పేర్కొన్నారు.