అంబేద్కర్ జీవితం సమాజానికి ఆదర్శం: కలెక్టర్
WNP: అంబేద్కర్ జీవితం సమాజానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సేవ చేయడం కూడా ముఖ్యం అని తెలిపారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.