VIDEO: వర్షాకాలంలో కరెంటుతో జర భద్రం

Wgl:వర్షాకాలంలో వ్యవసాయ బావుల వద్ద రైతులు నివాస గృహాల వద్ద ప్రజలు కరెంటుతో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ఎస్ఈ గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో విద్యుత్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద బోర్ల వద్ద విద్యుత్ సిబ్బందికి తెలవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేయరాదని సూచించారు.