హత్య కేసులో నిందితుల అరెస్ట్

NTR: విజయవాడ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ఈనెల 10న విజయవాడ వెటర్నరీ కాలనీలో జరామారావు అనే వ్యక్తిని హత్య చేశారన్నారు. ఈ కేసులో కేర్ టేకర్ అయిన మంగ ఆమె భర్త ఉపేందర్ రెడ్డిని అరెస్ట్ చేసామన్నారు. డబ్బు బంగారం కోసమే హత్య చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వారిని రిమాండ్ తరలించామన్నారు.