'నాంచారమ్మ జాతరకు సౌకర్యాలు కల్పించాలి'

'నాంచారమ్మ జాతరకు సౌకర్యాలు కల్పించాలి'

MLG: వెంకటాపూర్ మండలం రామంజపూర్‌లో మే 1న జరగనున్న నాంచారమ్మ జాతరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ టీఎస్ దివాకర్‌కు ఆదివాసి ఎరుకల సంఘం నేతలు వినతిపత్రం అందించారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని కోరారు. జాతరకు వేలాది భక్తులు తరలివస్తారని తెలిపారు. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.