రక్తదానం చేసిన తపాలా శాఖ ఉద్యోగులు

W.G: తణుకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తణుకు తపాలాశాఖ ప్రధాన కార్యాలయం ఉద్యోగులు మంగళవారం రక్తదానం చేశారు. కార్యాలయం అసిస్టెంట్ సూపరింటెండెంట్ మంగు సూర్యప్రకాష్ ప్రారంభించి మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ పోస్ట్‌మాస్టర్ చిట్టా వెంకటసుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.