లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి: ఐఎన్టీయూసీ
SRPT: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగాని నాగన్న గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. జిల్లాలో 80 వేల సభ్యత్వాలు లక్ష్యంగా పనిచేస్తున్నామని, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు.