గ్రామాలలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతాం

గ్రామాలలో దశలవారీగా అభివృద్ధి పనులు  చేపడతాం

కరీంనగర్: గ్రామాలలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చందుర్తి జెడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘ భవనం వద్ద జెడ్పీ నిధులతో బోర్ వేయుటకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.