చప్పిడిని పరామర్శించిన చేజర్ల

నెల్లూరు: కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ చప్పిడి శ్రీనివాసులురెడ్డి తండ్రి సుధాకర రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఈరోజు నెల్లూరు మాగుంట లేఔట్లోని వారి నివాసంలో చప్పిడి శ్రీనివాసులుని, వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శిచారు.