వజ్రప్రహార్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

వజ్రప్రహార్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

PPM: ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో శనివారం వజ్రప్రహార్ ఆపరేషన్‌లో భాగంగా రూరల్ సిఐ, బలిజిపేట ఎస్ఐ, ఎక్సైజ్ సిబ్బందితో కలిసి బాలగుడబలోని రెల్లి వీధిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 30 నాటు సారా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా అక్కడి స్థానికులచే మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.