కనిగిరి బట్టల దుకాణంలో భారీ చోరీ.. రంగంలో దిగిన క్లూస్ టీం
ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఆకృతి బట్టల షాపింగ్ మాల్‌లో గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. మాల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం సుమారు రూ.20 లక్షల నగదు అపహరించబడింది. మాల్ వెనుక భాగం నుంచి లోనికి ప్రవేశించిన దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేపడుతున్నారు. వివరాలు తెలియవలసి ఉంది.