వసతి గృహాల నిర్మాణానికి భారీ విరాళం

వసతి గృహాల నిర్మాణానికి భారీ విరాళం

NDL: మహానంది దేవస్థానం అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. నూతనంగా నిర్మించనున్న వసతి గృహాల నిర్మాణానికి హైదరాబాద్‌లో ఉంటున్న ప్రవాస భారతీయురాలు వడ్లమూడి సరోజిని రూ.1.25 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం HYDలోని వారి స్వగృహంలో కలిసి స్వామి, అమ్మవారి ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు.