'అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం తీసుకోవాలి'
NLG: చిట్యాల మండలం, వెంబావి అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ జరిగిన ఆరోగ్య లక్ష్మీ కమిటీ సమావేశంలో సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు పోషకాహార లోపం లేకుండా అంగన్వాడీ ద్వారా ఇచ్చే పాలు, గుడ్లు, పప్పు వంటి ప్రోటీన్ ఆహారం తీసుకోవాలని సూచించారు. సభ్యులు, గర్భిణులు, బాలింతలు, ఆశా వర్కర్ లక్ష్మీ అంగన్వాడీ టీచర్ సునీత పాల్గొన్నారు.