గ్రామ పంచాయతీ భవన స్లాబ్ పనులు ప్రారంభం

గ్రామ పంచాయతీ భవన స్లాబ్ పనులు ప్రారంభం

MHBD: మరిపెడ మండలం లచ్చ తండా గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా, భవన స్లాబ్ పనులను మరిపెడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి సోమవారం కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.