కొబ్బరి తోటలో చిరుత పులి జాడలు

కొబ్బరి తోటలో చిరుత పులి జాడలు

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చిరుత పులి కలకలం రేపింది. ఓ కొబ్బరి తోటలో రైతుకు చిరుతపులి కనిపించిందని బుధవారం తెలిపారు. రైతులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో అటవీ సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు. తమ ప్రాంతంలో చిరుత పులి సంచరించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.