సన్న బియ్యం మళ్లీ లేట్

SRPT: పేదలకు అందించే రేషన్ బియ్యం పంపిణీలో మళ్లీ జాప్యం జరుగుతున్నది. ప్రతి నెలా 20 నుంచి 5వ తేదీ వరకు గోదాముల నుంచి ప్రతి రేషన్ దుకాణానికి బియ్యం పంపిణీ జరుగాల్సి ఉండగా, ఇప్పటికీ జిల్లాలో 15 శాతం షాపులకు కూడా బియ్యం చేరలేదు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 610 రేషన్ షాపులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 88 షాపులకే బియ్యం చేరింది.