పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: ఎస్పీ

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: ఎస్పీ

WNP: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆయన జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించి, నిర్వహించారు. అమరుల త్యాగం మరువలేనిదని, ప్రతీ పోలీసుకూ అది ఆదర్శమని, వారి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.