టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: రవి
JN: విద్యాహక్కు చట్టం, ఎన్సీటీఈ నోటిఫికేషన్‌కు పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని TG UTF రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. జనగామలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.