నేడు విద్యుత్ సరాఫరాకు అంతరాయం
కోనసీమ: కొత్తపేట 33/11 KV విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో అత్యవసర మరమ్మతు పనుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కొత్తపేట, వాడపాలెం, మందపల్లి, గంటి, పలివెల, అవిడి, ఖండ్రిగ ప్రాంతాలతో పాటు పలివెల వంతెన నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంటు ఉండదని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.