ఆ డ్రైవర్లకు కమిషనర్ హెచ్చరికలు
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆప్కాస్ విధానంలో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి కమిషనర్ వై. ఓ నందన్ పలు హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవర్లు క్రమశిక్షణ పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. ఇవాళ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు జారీ చేశారు.