నియోజకవర్గంలో నాబార్డు నిధులతో రోడ్లు

NTR: నాబార్డు నిధుల క్రింద నందిగామ నియోజకవర్గంలో అనాసాగరం నుండి హనుమంతుపాలెం రోడ్డుకు రూ.148 లక్షల నిధులు విడుదలైనట్లు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం తెలిపారు. వీరులపాడు మండలం జయంతి నుంచి ఎర్రుపాలెం రోడ్డుకు రూ.175 లక్షల మంజూరు అయ్యాయని తెలియజేస్తూ వారి కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపారు.