VIDEO: ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన
HYD: రామంతపూర్‌లోని ఓ స్కూల్ వద్ద ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. గత నాలుగేళ్లలో 2 నుంచి 5వ తరగతి వరకు 140%, 6 నుంచి 10వ తరగతి వరకు 84% ఫీజులు పెంచడాన్ని వ్యతిరేకించారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.