సర్పంచ్‌ను సన్మానించిన కడియం
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లి గ్రామ నూతన సర్పంచ్ కందుకూరి జయేందర్‌తో పాటు వార్డు సభ్యులను మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జయేందర్‌తో పాటు 12 మంది వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఈ మేరకు వీరిని అభినందిస్తూ ఎమ్మెల్యే శాలువాలు కప్పి సత్కరించారు.