ఆసుపత్రి ఎదుట ఆందోళన

ఆసుపత్రి ఎదుట ఆందోళన

RR: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లిమ్స్ హాస్పిటల్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మదనపల్లి పాత తండా గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోని సామాన్లను ధ్వంసం చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.