విద్యార్థులకు గ్రంథాలయంలో కంప్యూటర్లు ఏర్పాటు
SKLM: సంతబొమ్మాళి ప్రభుత్వ శాఖ గ్రంథాలయంలో మంగళవారం 2 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసినట్లు స్థానిక లైబ్రేరియన్ కే. కృష్ణారావు తెలియజేశారు. ఇందులో పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌లో సమాధానాలు, బబ్లింగ్ చేసే విధానం పై తర్ఫీదు పొందవచ్చన్నారు. వివిధ కాంపిటీటివ్ బుక్స్ చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.