భీంపూర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే

భీంపూర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే

ADB: భీంపూర్ మండలంలో వర్షాలకు దెబ్బ తిన్న పంటలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ధైర్యం చెప్పారు. నష్టపోయిన వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పెన్‌గంగా నదిని పరిశీలించి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.