ఎమ్మెల్యే వేముల వీరేశంకు ప్రభుత్వ విప్..!

ఎమ్మెల్యే వేముల వీరేశంకు ప్రభుత్వ విప్..!

NLG: రాష్ట్రంలో మరో ముగ్గురు నూతన విప్‌లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు.